Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ మున్సిపల్ సిబ్బందితో కలిసి డివిజన్లోని ఇందిరానగర్ ఫేస్-1 ఫేజ్ 2, కృష్ణ్ణానగర్, లక్ష్మీనగర్, మంగాపురం కాలనీల్లో పర్యటిం చారు. ఈ సందర్భంగా స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా అక్కడక్కడా నిల్వ ఉన్న వరద నీటిని మున్సిపల్ సిబ్బందితో కలిసి నాళాలోకి పంపేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్ర మంలో కాలనీల సంక్షేమ సంఘం నాయకులు సతీష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అశోక్, బషీర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సాయికుమార్ ముదిరాజ్, పూస రమేష్, స్థానిక యువకులు, తదితరులు పాల్గొన్నారు.