Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఈ నెల 23వ తేదీన ఘట్కేసర్ పట్టణంలో జరుగనున్న గట్టుమైసమ్మ జాతరను రద్దు చేసినట్టు దేవాదాయశాఖ ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆలయ కార్యలయంలో ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. కొవిడ్, ఒమిక్రాన్ వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆలయాల ఉత్సవాలు, జాతరలు జరపకూడదని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ1 మార్గదర్శకాల ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్ కె.అనిల్ కూమార్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. దేవాదాయశాఖ అన్ని ఉత్సవాలను రద్దు చేయాలని ఈ నెల10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. జీఓ 1 ప్రకారం కొవిడ్, ఒమిక్రాన్ వైరస్‌లను నిరోధించుటలో భాగంగా ఘట్టుమైసమ్మ జాతరను రద్దు చేసినట్టు ప్రకటించారు. ఈ విషయమై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతరను రద్దు చేయడానికి ఆలయ కమిటీ చైర్మెన్, డైరెక్టర్ల సమక్షంలో తీర్మాణం చేసినట్టు తెలిపారు. భక్తులు అమ్మవారికి అంతరంగికంగా జరుపుకునే అభిషేకాలు యాధావిధిగా కొనసాగుతాయనీ, అమ్మవారిని దర్శించు కునేవారు మాత్రం అనుమతి ఇవ్వబడుతుందని తీర్మాణం చేసినుట్ట పేర్కొన్నారు. ధర్మనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మెన్ మామిళ్ల చిత్తారియాదవ్, డైరెక్టర్లు కందకట్ల పద్మారెడ్డి, ఎర్రోల్ల మైసయ్య, బొక్క జంగారెడ్డి, బర్ల సరోజ, సార శ్రీనివాస్‌గౌడ్, ఉత్సవ కమిటీ చైర్మెన్ పొట్లచెరువు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.