Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగం రూం 100 ప్రారంభో త్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పాల్గొని రూంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీం, పీఎంఏవై, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఈ సేవలను పొందవచ్చన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న లబ్దిదారులు హెల్ప్ డెస్క్ 100 సంప్రదించి అవసరమైన సాధారణ చికిత్స నుంచి క్లిష్టమైన శస్త్రచికి త్సలకు ఈ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీంలో పొందు పరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ బి.శ్రీనివాసులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ రఫీ, డాక్టర్ కవిత, డాక్టర్ నరేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.