Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్, కుషాయి గూడ డిపో మేనేజర్ సుధాకర్ ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్సు డిపోలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు, మహిళా సూపర్ వైజర్లు, మహిళా కార్మికులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరా బాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ డివిజన్ రీజినల్ మేనేజర్ యుగంధర్ కుషాయిగూడ, లైన్స్ హాస్పిటల్ చైర్మెన్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఏఎస్ రావునగర్ మంగళగౌరీ సిల్క్స్, అనుటెక్స్ షాపింగ్‌మాల్ వారు నాణ్యమైన చీరల బహుమతులు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా వెెంకటేశ్వర్లు, ఉపేందర్ మాట్లాడుతూ మహిళలందరూ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నందకు ఆనందంగా ఉందనీ, కార్మికులు అందరూ కలిసికట్టు గా పనిచేసి సంస్థను లాభాల్లో నడిపించాలని కోరారు. కొత్త రామారావు మాట్లాడుతూ బతుకమ్మ సంబురాలు, సంక్రాంతి ముగ్గుల పోటీలకు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలలు, కళాకారులను డిపో మేనేజర్ శాలువాతో సన్మానించి, కన్సల్టెంట్ బహుమ తులను అందజేశారు. హరిదాసు కీర్తనలు, తుపాకీ రాము డు వేషధారణలు, గంగిరెద్దులు, కళాకారుల ఆటపాటలతో బస్సు డిపో కార్మికులు అందరూ సంక్రాంతి సాంప్రదా యక నృత్యాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయి గూడ బస్సు డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి, అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, ఏఎస్రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు మురళి పంతులు, రాజు, తదితరులు పాల్గొన్నారు.