Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసికోల్లాసానికి దోహదపడుతాయని కేశవరం సర్పంచ్ ఉడుతల జ్యోతి బలరాంగౌడ్ అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో శనివారం సర్పంచ్ ఉడుతల జ్యోతిబలరాం గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్లకు సర్పంచ్ గ్రామ పెద్దలతో కలిసి బహుమతుల ప్రదానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన నరేష్ చారి జట్టుకు రూ.5వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ప్రశాంత్ జట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానంలో నిలిచిన మహేష్ జట్టుకు రూ.2వేల నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడలు సమాజంలో మంచి గుర్తింపును, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడతాయ న్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రదీప్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చిత్తారి యాద వ్, గ్రామశాఖ అధ్యక్షుడు భూమేశ్ గౌడ్, శ్రీ బాలాజీ వెంక టేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మెన్ మైసయ్య యాదవ్, గ్రామ రైతుబంధు కమిటీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉడుతల క్రిష్ణగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, నెల్లుట్ల బలరాం, శివయాదవ్ పాల్గొన్నారు.