Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్కు చెంది న నెమలి రవి కుమార్ నియామకమయ్యారు. గురుకల పాఠశాలల విద్యార్థుల భవిష్యత్, పాఠశాలల్లో మౌలిక సదు పాయాల కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించాలనీ, సొంత భవనాలు లేని స్కూళ్లకు సొంత భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్లో గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్య క్రమంలో స్వేరోస్ రాష్ట్ర కన్వీనర్ కిరణ్కుమార్, టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, మాజీ అధ్యక్షులు సదానందం, రాష్ట్ర నాయకులు సూరపల్లి నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.