Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట
''ప్రస్తుతం మీరు నివసిస్తున్న జీహెచ్ఎంసీ క్వార్టర్స్ ఇక మీ సొంతం కాబోతున్నాయి'' అని క్వార్టర్స్‌లలో నివసిస్తున్న ప్రజలకు సంక్రాంతి పండుగ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ శుభవార్త చెప్పారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్, బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ, రాంగోపాల్‌పేట డివిజన్ నల్లగుట్ట ప్రాంతాల్లోని క్వార్టర్స్‌లో నివసిస్తున్న లబ్దిదారులతో శనివారం మంత్రి తలసాని అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏండ్లుగా రెగ్యులరైజ్ కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుకగా జీహెచ్ఎంసీ క్వార్టర్స్‌ను నామమాత్రపు ధరకు మీకే రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించారనీ, దీంతో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని అనేక కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ముందుగా మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ గ్రౌండ్లో న్యూ బోయ గూడ లబ్దిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనకు ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని రూ.4 కోట్లతో ఆదయ్య నగర్లో నిర్మించారనీ, దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నల్లగుట్ట లబ్దిదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ క్వార్టర్స్, లీజు ల్యాండ్స్లలో ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకె ళ్లాననీ, రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరిం చారని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణగౌడ్, ఆకుల రూప, జీహెచ్ఎంసీ ఎస్టేట్ ఆఫీసర్ భాషా, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.