Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగ్గురు నిందితుల అరెస్ట్
9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కేర్‌టేకర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 9తులాల బంగారు ఆభరణాలు, టూ వీలర్, మూడు సెల్ ఫోన్లు, కత్తి, రూ.27వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం గాంధీనగర్ ఎస్‌హెచ్‌వో ఎన్.మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా ఇనుగుర్తికి చెందిన కావటి రాజు, గాంధీనగర్, ఎస్బీఐ కాలనీకి చెందిన ఒకరి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరాడు. వారింట్లో బంగారు ఆభరణాలు, నగదును చూసిన అత ను ఎలాగైనా వాటిని దొంగిలించాలనుకున్నాడు. అబ్దుల్లాపుర్మెట్కు చెందిన పూజారి సాయికుమార్‌గౌడ్, ఇంజమూరి దినేష్‌కుమార్ స్నేహితులతో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు. ఈనెల 13న సాయికుమార్ గౌడ్, దినేష్ కుమార్ రెంటుకు ఇల్లు కావాలంటూ సదురు వ్యక్తి ఇంటికి వచ్చారు. మిద్దెమీద ఖాళీగా ఉందని చెప్పడంతో ఒకరు యజమానితోపాటు వెళ్లి ఇంటిని చూసినట్టు నటించగా, ఇద్దరు ఇంటిలోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన గాంధీనగర్ పోలీసులు చివరకు కేర్‌టేకరే సూత్రధారికగా గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.