Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ప్రజల కోసం పనిచేయడానికి పదవులు అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పంక్షన్ హాల్లో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నియెజక వర్గం సభ్యత్వ నమోదు ఇంచార్జీ భవానీ రెడ్డిలు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా మూడు వందల నుంచి ఐదు వందల వరకు సభ్యత్వాలు చేయించాలని కోరారు. సభ్యత్వం చేయించడం వల్ల పార్టీకి బలమైన శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. కష్టపడి పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ ఎన్నికల ముందు వస్తారని, ప్రజలు తమ ఓటు ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, పేదల కోసం పనిచేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త నాయకత్వ లక్షణాలను ఉనికిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్, జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్, కౌన్సిలర్ పసుల రాజేందర్, సహకార సంఘం డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి గౌస్ పాషా, సీనియర్ నాయకులు చామ విజయశేఖర్ రెడ్డి, పారంద కిషన్, మోర ప్రభాకర్, బుర్ర చంద్రం గౌడ్, మేడిపల్లి వేంకటేష్, చామ కష్ణ రెడ్డి, చెరుకు శివశంకర్, నాయకులు సీిహెచ్ భాస్కర్‌చారి, మందుగుల శ్రీకాంత్, మాచగోని మహేందర్, బుర్ర గోవర్థన్, బుర్ర లింగం, శ్రీరాములు పాల్గొన్నారు.