Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్ :
మున్సిపాలిటీలో దశల వారీగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నామని చైర్మెన్ బోయ పల్లి కొండల్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ లక్ష్మీనర్సింహ్మ కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ 11లక్షలతో చేపడుతున్న ప్రహరీ నిర్మాణ పనులను మంగళవారం చైర్మెన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలు అభివృద్ధి చెందినప్పుడే విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కౌన్సిలర్ చింతల రాజశేఖర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, నాయకులు సంతోష్ నాయక్, లక్ష్మణ్ యాదవ్, ప్రశాంత్ నాయక్, విఆర్ఎ కృష్ణ, యువజన నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.