Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
నాలావిస్తరణ పనుల్లో వేగం పెంచాలని, త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు నుంచి ఎల్లమ చెరువు వరకు రూ.6 కోట్ల అంచ నావ్యయంతో చేపట్టిన నాలా విస్తరణ పనుల్లో భాగంగా రాంకీ పెరల్వద్ద జరుగుతున్న పనులను ప్రాజెక్ట్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ప్రజావసరాల దష్ట్యా, రాబోయే వర్షకాలాన్ని దష్టిలో పెట్టుకొని నాలా విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో సైతం అభివద్ధి, సంక్షేమం పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంద న్నారు. పనులోల నాణ్యాతా ప్రమాణాలు పాటించాలని ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ డీఈ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.