Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంద్ చేయడం సరికాదు
సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. గాంధీ నాయక్
నవతెలంగాణ-హైదరాబాద్
నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నడపాలని, పూర్తిగా బంద్ చేయడం సరికాదని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.గాంధీనాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బార్లు, వైన్‌షాపులు, ట్రైన్లు, బస్సులు, మార్కెట్లు వంటి ప్రదేశాల్లో రాని కరోనా బడుల్లో మాత్రమే వస్తుందా? అని ప్రశ్నించారు. ఆన్లైన్ క్లాసులు వినేపరిస్థితి అంతటా లేదని, ఉన్నచోట కూడా అవి విద్యా ర్థులకు సరిగ్గా అర్థమయ్యే పరిస్థితి లేదని తెలిపారు. విద్యా సంస్థలను మూసి వేయడం వల్ల విద్యార్థులు నష్ట పోతారని, పేద విద్యార్థులకు ఇది మరింత ఇబ్బందికరమని ఆవేదన వ్యక్తం చేశారు.