Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధి పోచారం గ్రామంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను పోలీసు బలగాల మధ్య హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ సురేష్‌ల ఆధ్వర్యంలో ఇతర అధికారులు. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పోచారం గ్రామంలోని బొడ్డురాయి వద్ద చేపట్టిన నిర్మాణాంలో రెండు షెటర్లను కూల్చివేశారు. సమీపంలో అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనంలో కేవలం గోడలు మాత్రమే కూల్చివేశారు. ప్రాథమిక పాఠశాల సమీపంలో మరో రెండు అనుమతులు లేని భవనాలను, గోడలు కూల్చి భవనాల యజమానులకు అనుతులు తీసుకో వాలని హెచ్చరికలు చేసి చేతులు దులుపుకొని అక్కడి వెళ్ళిపోయారు. అధికారులకు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలపై కఠిణ చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు.