Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైేతు సంఘం రాష్ట్ర నాయకులు టి.కిషోర్
నవతెలంగాణ - మీర్పేట్
తరతరాలుగా భూమిని సాగుచేసుకుంటూ బతుకుతున్న దళితుల భూములు దళితులకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకులు టి.కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మీర్పేట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీర్పేట్లోని సర్వే నెంబర్ 46లో ఉన్న 24 ఎకరాల భూమి ఉంది. దానిలో 18 ఎకరాల్లో గతంలో ప్లాట్లు చేశారు. మిగిలిన 6 ఎకరాల్లో ఎస్సీలు (దాదాపు 100 కుటుంబాలు) చాలా సంవత్సరాలు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి తమ తాతలు, తండ్రులు వ్యవసాయం చేశారని తెలిపారు. గతంలో 12 కుటుంబాలుగా ఉన్న వారు ఇప్పుడు దాదాపు 120 కుటుంబాల వరకు పెరిగారని, వీళ్లంతా ఆ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. అందుకే వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ బాధితులు కేవీపీఎస్ బాలాపూర్ మండల అధ్యక్షులు దాసరిబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న మాకు ఏ ఇతర ఆధారం లేదని వాపోయారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల సమయంలో ఇదే భూమిలో ప్రతీ కుటుంబానికి 200 గజాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు మీర్ పేట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాసరి యాదయ్య, దాసరి సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.