Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్ల 50లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మెన్ అబ్దుల్లాసాది అన్నారు. మున్సిపల్ కమిషనర్ జి. ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్, టీఆర్ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫాలతో కలిసి మంగళవారం మున్సిపల్ పరిధిలోని హైవే హోటల్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న 6,7,8 వార్డులోని వివిధ కాలనీనీలలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానికంగా సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వాటి నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారని చెప్పారు. త్వరలో రోడ్డు నిర్మాణ పనులను మంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మజర్ అలీ, అలీభారు, డీఈ విశ్వేశ్వర్ రావు, ఏఈ ఇష్రత్, ఎన్విరాన్మెంటల్ ఇన్చార్జి, సూపర్వైజర్ శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.