Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో వున్న చిలుకానగర్, ఉప్పల్ వెళ్లే ప్రధాన దారిలో ఉన్న వంతెన.. చిన్నపాటి వర్షానికి పొంగిపొర్ల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పాలకులు పట్టించుకోరు అధికారులు స్పందించరు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. చిల్కానగర్ వెళ్లే బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి హైదరాబాద్‌ను డల్లాస్ లండన్ చేస్తానన్నారు. ఇవేనా డల్లాస్ లండన్ ప్రధాన రహదారులు అని ఆయన ప్రశ్నించారు. ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు పట్టింపులేదని, ఎన్నిసార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా చూసీిచూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతింది. ఈ కారణంగా చిలుకానగర్ ఉప్పల్ వెళ్లే ప్రధాన దారిలో ఉన్న ఈ వంతెన చిన్నపాటి వర్షానికే అతలాకుతలం అవుతుంది. ఈ సమస్య పట్ల ఎన్నిసార్లు ప్రజలు మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి విన్నవించు కున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కారణం వల్ల నిత్యం వందలాది మంది ప్రజలకు ఈ దారిగుండ వెళ్లే పరిస్థితి లేకుండా అవుతుంది.శనివారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా వర్షపు నీరు అలాగే నిలిచి పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. పద్మావతి కాలనీ స్వరూప్‌నగర్ కాలనీ, హేమ నగర్, సెవెన్‌హిల్స్ కాలనీ, పలు కాలనీలకు ముఖ్యమైన రహదారి కావడంతో ప్రజలకు, కాలనీవాసు లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుందన్నారు. ఇకనైనా సమస్య పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాల యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మెన్ మేకల శివారెడ్డి, మేడల మల్లికార్జున్ గౌడ్, సుధాకర్ శెట్టి, కాలనీవాసులు మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి. దేవేందర్, కష్ణ, అశోక్ రెడ్డి, మహేష్, పరమేష్, ఉమేష్, డీసీసీ ఆర్గనైజ్ సెక్రెటరీ సంజరు జైన్, జిల్లా ఎస్టీ సెల్ చైర్మెన్ గణేష్ నాయక్, చరణ్ కౌషిక్ యాదవ్, షేక్ మాజర్ పాల్గొన్నారు.