Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్‌మెట్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మంగళవారం కవాడిగూడ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డీబీఆర్ మిల్స్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్‌తో మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, 15 నుంచి 18 ఏండ్ల వయసు వారికి ఇచ్చే వ్యాక్సిన్‌పై స్పందన ఎలా ఉంది, వద్ధులకు బూస్టర్ డోస్ ఇస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా పెంచాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, డీబీఆర్ మిల్స్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.రవి కుమార్, పీహెచ్ఎన్ ఉమా మహేశ్వరి సంగీత, స్టాఫ్‌నర్స్ జ్యోతి, ఫార్మసిస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.