Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌ను ట్రాఫిక్లెస్ సిటీగా మార్చడంలో భాగంగా చేపట్టిన ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీ, ఆర్‌యూబీలు ఒక్కొక్కటిగా అందుబాటులోకొస్తున్నాయి. పాతబస్తీ లోని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్లను ప్రారంభించడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్‌పెట్టారు. త్వరలో తుకారాంగేట్ ఆర్యూబీని సైతం ప్రారంభించనున్నారు. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లేందుకు ఇబ్బందిని తొలగిం చడానికి ఉక్కు వంతెనను నిర్మించారు. దీనిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించ నున్నారు.
రూ.17 కోట్లతో..
పంజాగుట్ట శ్మశానవాటిక పాత ముఖద్వారాన్ని తొలగించి రూ.17కోట్లతో ఉక్కు వంతెనను నిర్మించారు. దీంతో శ్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోతున్నాయి. పాత గేట్ నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా నేరుగా వెళ్లవచ్చు. స్టీల్ బ్రిడ్జీని పాతగేట్ నుంచి హెచ్‌టీ లైన్ వరకు రోడ్డు విస్తరించడం మూలంగా గతంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్య తీరనుంది. మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు.
రేపు ప్రారంభం
హైదరాబాద్ సిటీలో మౌలిక వసతులను కల్పనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్ సమస్య లకు చెక్ పెట్టడమేగాక, ప్రజల అవసరాలు తీరుతు న్నాయి. స్టీల్ బ్రిడ్జీని గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, కార్పొరేటర్లు తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.