Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం అందడం గొప్ప వరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన రాజారామ్ కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద విడుదలైన రూ.40 వేల చెక్కును ఎమ్మెల్యే మంగళవారం వారి కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, సీసీఎస్ ప్రతినిధులు, నాయకులు ఎంపల్లి పద్మారెడ్డి, బొడిగె రాజుగౌడ్, గంపకృష్ణ, వినోద్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.