Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ డివిజన్ చంద్రగిరి కాలనీలో బాక్స్ డ్రయినేజీ పనులను కాలనీ వాసులు, సంబంధిత అధికారులతో కలిసి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మంగళవారం పర్యవేక్షించారు. పనులు చేస్తున్న సమయంలో డ్రయినేజీ నీళ్లు కలిసి మంచి నీళ్ళు కలుషితం అవుతున్నాయని స్థానిక ప్రజలు విషయాన్ని దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను అక్కడికి పిలిపించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ మేనేజర్ నవీన్, డివిజన్ వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, బల్దియా సిబ్బంది, వాటర్ వర్క్స్ సిబ్బంది, స్థానిక కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.