Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయాల్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వినాయక్ నగర్ డివిజన్లో అన్ని కాలనీలు, బస్తీలకు మధ్యలో ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రంలో మొదటి, రెండో డోసు, 15-18 ఏండ్ల వారికి, 60 ఏండ్ల వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, భాస్కర్, సూర్యకాంత్, గడప నర్సింగ్‌రావు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.