Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ రోడ్డు పరిధిలో కాలనీల అనుసంధా నానికి నాలాలపై కల్వర్టులను వెంటనే నిర్మించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కోరారు. కల్వర్టు నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు సులువుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మంజూరై పెండింగ్‌లో ఉన్న మూడు కల్వర్టులు నిర్మించాలని ఆయన బోర్డు సీఈవో అజిత్ రెడ్డిని కోరారు. మంగళవారం జంపన ప్రతాప్ ఆ కాలనీల్లో పర్య టించి మాట్లాడారు. మలాని కాలనీ, వరుణ్ కాలనీ ల మధ్య మూడో వార్డు పీఅండ్‌టీ, మార్గదర్శి కాలనీ ల మధ్య భావన ఎనక్లేవ్, జయనగర్ మధ్య కల్వర్ట్ల నిర్మాణం చేయా లని కోరారు. అయ్యప్ప సొసైటీ నుంచి వరుణ్ కాలనీ -అవంతి సొసైటీతో పాటు మరో ఐదు కాలనీలకు రోడ్డు వసతి లేదనీ, వరుణ్ కాలనీలో ఉన్న చౌదరి ఇంటికి పెళ్లి విషయమై అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 15 ఏండ్ల క్రితం వచ్చినపుడు కనుకుక మల్లారెడ్డికి చెందిన ప్లాట్‌లో కట్టిన ప్రహరీ గోడను కూల్చేసి రోడ్డు సౌకర్యం కల్పించామనీ, అప్పటి నుంచి కాలనీవాసులు ఆ ప్లాట్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. కాలనీవా సులు ఇబ్బంది పడకుండా కల్వర్టు నిర్మించాలని కోరారు.