Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి బంగారు బాబు
నవతెలంగాణ-బడంగ్పేట్
హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలను త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీగా మార్చేందుకు చర్యలు చేపట్టిందని, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత ఐలమ్మ పేరు పెట్టాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నాదర్ గుల్ రైతు సహకార బ్యాంక్ వైఎస్ చైర్మన్ బంగారు బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపు నాలుగు వేలకు పైగా విద్యార్థినులు ఉన్న ఈ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలనుకోవడం హర్షనీయమన్నారు. ఐలమ్మ పేరును నామకరణం చేస్తే మహిళా లోకానికి గౌరవం ఇచ్చిన వారము అవుతామని అయన పేర్కొన్నారు.