Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళితబంధుపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటిని ముట్టడిస్తాం
బీజేపీ కార్పొరేటర్ల సవాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
వెయ్యి కోట్ల రూపాయల అభివద్ధి ఎక్కడ చేశారో ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్లు సునితా ప్రకాష్ గౌడ్, సుప్రీత్ నవీన్ గౌడ్, ఎ. పావని వినరు కుమార్, జి. రచన శ్రీ సవాల్ చేశారు. బుధవారం అడిక్‌మెట్‌లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.426 కోట్లతో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి ఎమ్మెల్యే గోపాల్‌కు సంబంధమే లేదన్నారు. నియోజకవర్గంలో ఒకసారి రూ. 150 కోట్లతో అభివద్ధి చేశానని, మరో సారి వెయ్యి కోట్లతో అభివద్ధి చేశానని మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వెయ్యి కోట్లతో ఎమ్మెల్యే గోపాల్ అభివద్ధి చేసింది నిజమే అయితే మరీ ప్రతి డివిజన్, బస్తీలో డ్రయినేజీ మ్యాన్ హోల్స్ ఎందుకు పొంగుతున్నాయని ప్రశ్నించారు. వెయ్యి కోట్లతో అభివద్ధి ఎక్కడ చేశారో ఎమ్మెల్యే గోపాల్ బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని సవాల్ చేశారు. ముషీరాబాద్ ఆదర్శ కాలనీ, చేపల మార్కెట్లో పదుల సంఖ్యలో ఆయన పర్యటించినా కూడా నేటికీ సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. సాయిచరణ్ కాలనీలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేదన్నారు. దళితబంధు టీఆర్ఎస్ నాయకులకే ఇస్తున్నారని, హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీల్లో ఒక్క ఇల్లు తొలగించబోమని ఎమ్మెల్యే సంబరాలు జరుపుకున్నారని, కానీ చాలామందికి అధికారులు నోటీసులు ఇస్తున్నారన్నారు. వీటి పై ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్, నాయకులు ఎ. వినరు కుమార్, తరుణ్ గౌడ్, నరేష్, కిశోర్, గడ్డం నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.