Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బస్తీ దవాఖాన మంజూరై ఆరు నెలలు గడుస్తున్న స్థలాన్ని వెతకడంతో కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ మండల సీపీఐ కార్యదర్శి ఈ. ఉమామహేష్ అన్నారు. జగద్గిరిగుట్టలో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని బుధవారం గాజులరామారం డీసీ ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులరామారం సర్కిల్లో అన్ని డివిజన్లలో రెండు బస్తీ దవాఖానలు ఉంటే జగద్గిరిగుట్టలో ఒకటి లేకపోవడం దారుణమన్నారు. జగద్గిరిగుట్టలో మోడల్ మార్కెట్ వృథాగా ఉందని, వెంటనే బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళనలు చేసినప్పుడే మొదలు పెడుతామని చెప్పి ఇప్పటికి చేయకపోవడం నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. జగద్గిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల రోడ్డును బాగు చేయాలని, లెనిన్‌నగర్‌లో నాలాలపై పై కప్పు వేయకుండా, ఫెన్సింగ్ వేయకుండా ఉంచారని వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సహదేవ్, రాములు, సదానంద్, రవి, ఆదినారాయణ, చంద్రయ్య, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.