Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అభివృద్ధి పనుల్లో జాప్యం వహించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని జగద్గిరినగర్‌లో ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూగర్భ డ్రయినేజీ పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జలయండలి మేనేజర్ అంకిత్, నాయకులు రుద్ర అశోక్, మల్లేష్‌గౌడ్, బాబుగౌడ్, హజ్రత్‌అలీ, యాదగిరి, విఠల్, మనోజ్, ప్రభాకర్, సురేష్, శ్రీనివాస్, శశిధర్, హనుమాన్చారి, జగన్, సాజిద్, ఆజం, రామ్శెట్టి, సత్తిరెడ్డి, ఖయ్యుం, కలీం, విగేష్, కిరణ్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప, మగ్దూంనగర్లోని పోచమ్మ ఆలయం వద్ద బుధవారం ఖార్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు సుమన్ మల్లాది, డైరెక్టర్ మంజులత మల్లాది ఆధ్వర్యంలో ముత్తుట్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఖార్డ్ సేవ సంస్థ, ముత్తుట్ సేవా సంస్థ సభ్యులు మీరయ్య, అనిల్, యేసు, అవిష్, నాయకులు సంతోష్, విగేష్, రాజు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.