Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
గౌడ కులస్తులు తమ హక్కులను రాజకీయాలకు అతీతంగా సాధించుకోవాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కమిటీ రూపొందించిన క్యాలెండర్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమితి జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్, జాతీయ నాయకులు కొండాపురం బాలరాజ్ గౌడ్, పల్లె ఉపేందర్ గౌడ్, ముత్యం నర్సింహుల్ గౌడ్, బాలసాని సురేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు అనంతుల రమేష్‌గౌడ్, రాగుల కిరణ్‌కుమార్ గౌడ్, అదిరె ఆంజనేయులు గౌడ్, మంద రామారావు గౌడ్, మహిళా నాయకులు పన్నల మమత, ఎం.శైలజ, విలాసాగరపు మాధవి గౌడ్, మచర్ల హర్షవర్ధన్ గౌడ్, అంతటి మహేశ్వరి, కళావతి గౌడ్, రజని గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా చిన్నగౌడ్ పహిల్వాన్ తదితరులు పాల్గొన్నారు.