Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో సమస్య పునరావృతం కాకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భూమిరెడ్డికాలనీ, శివారెడ్డినగర్, వెంకన్న హిల్స్లలో ప్రజా సమస్యలపై బుధవారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం భూమిరెడ్డికాలనీలో నిర్మిస్తున్న కల్వర్టు పనులను, కాలనీల్లో నెలకొన్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రయినేజీ సమస్యలను, సుచిత్ర రోడ్డు జీన్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కెమికల్ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న వర్షాకాలానికి ముందుగానే కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెంకన్న హిల్స్ నుంచి మొదలుకోని జీన్స్ ఫ్యాక్టరీ వద్ద కెమికల్ నాలా వరకు మిగిలిన రిటైనింగ్ వాల్స్లను మంజూరైన ఎస్ఎన్డీపీ నిధులతో వేగంగా పూర్తి చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యయ ప్రణాళికలు సిద్దం చేసి నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణానికి, భూగర్భ డ్రయినేజీల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, ఏఈ సురేందర్‌నాయక్, ఇరిగేషన్ ఏఈ రామారావు, జలమండలి మేనేజర్ అనూష, కాలనీవాసులు భూపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పెద్ది మల్లేష్, వెంకట్‌రెడ్డి, సుభాష్, దుర్గారావు, మురళీ, శ్రీనివాస్, జయంచారి, రామ్మోహన్రావు, తిరుపతిరెడ్డి, కొమటి శ్రీనివాస్, శేఖర్, గోవింద్, వెంకటేష్, విజరు, హరిష్ తదితరులు పాల్గొన్నారు.