Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు రెండో వార్డులోని కట్ట మైసమ్మ కృష్ణానగర్ బస్తీలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్ బస్తీలోని సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు మురికి కాలువల సమస్యలను శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఎమ్మెల్యే సాయన్న బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి, అధికారులతో చర్చించరు. ఇంజినీరింగ్ అధికారులు బాలకృష్ణ, సంబంధిత ఇంజినీర్లు స్పందించిన మురికి కాలువ నిర్మాణం కోసం అంచనాలు చేశారని త్వరలో పనులు కూడా చేపడతారని శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.