Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ పరిధిలోని వాణినగర్ విజయ వినాయక టెంపుల్ నూతన కార్యవర్గాన్ని బుధవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, ఈవో వెంకన్న ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఆలయ చైర్మెన్‌గా నర్సింగ్‌రావు, సభ్యులుగా శివ శంకరి, కిట్టు, వీరభద్రారావు, రాజకుమార్, మల్లయ్య, ధర్మకర్తగా శాస్త్రిలను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించి, స్తానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.