Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మల్లాపూర్ డివిజన్లోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జి.సురేందర్‌రెడ్డికి రూ.60 వేలు, శ్రీలతకు రూ.44 వేలు, ఎం.రాములుకు రూ.54 వేలు, స్వప్నకు రూ.34 వేలు, పి.అశోక్ కుమార్ కు రూ.60 వేలు, కే.పవన్ కుమార్‌కు రూ.60 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి ఆపన్న హస్తంగా సీఎంఆర్ఎఫ్ నిధి ఉపయోగపడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, నగరం చంద్రశేఖర్, మేకల ముత్యం రెడ్డి, మధసూధన్ రెడ్డి, పన్నాల నిఖిల్ రెడ్డి, గరిక సుధాకర్, వేముల సంతోష్, కాటేపల్లి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.