Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని విమలాదేవి నగర్, దేవినగర్‌లో జరుగుతున్న రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులను దశల వారీగా పూర్తి చేసి, మల్కాజిగిరి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పగిలిపోయిన డ్రయినేజీ పౖౖెప్లైన్లను తొలగించాలనీ, మాన్యువల్ కవర్స్‌లో నాణ్యత పాటించాలనీ, వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య, ఏఈ దీపక్, ఏఈ సత్యలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, బీజేపీ నాయకులు వినోద్ యాదవ్, శివానంద్, శివ, సోమ శ్రీనివాస్, పిచ్చయ్యశాస్త్రి, లక్ష్మయ్య, సాయి పటేల్, కాలనీ సభ్యులు వైద్యనాథనం, నారాయణ రావు, రవీందర్, రతన్ రాజ్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.