Authorization
Sun March 23, 2025 02:31:37 am
నవతెలంగాణ-కాప్రా
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ నాయకుడు జౌండ్ల ప్రభాకర్‌రెడ్డిని బుధవారం చర్లపల్లి మింట్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత..
కరోనా బారిన పడి కోలుకున్న చర్లపల్లి మింట్ కాలనీలో జరీనా బేగంకు రూ.60వేలు, మధుసూదన్ రెడ్డినగర్‌లోని శ్రీధర్ వరలక్ష్మి కుటుంబానికి రూ.40వేలు సీఎం సహాయనిధి కింద విడుదలైన చెక్కులను అందజేశారు.