Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.56.50లక్షలతో కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను బుధ వారం ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఈసీఐఎల్ కార్మిక సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవర ణలో సీసీ రోడ్లు, గార్డెనింగ్ పనులను వేగవంతం చేయాల న్నారు. విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఇతర అవసరాల కోసం ఉపయోగించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పాఠశాల కు ఎదురుగా ఉన్న భవనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం కోసం హాల్‌ను తయారు చేయాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యా బోధన జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందిస్తామని చెప్పారు. ఈసీఐఎల్ కంపెనీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులతో పాఠశాల భవనానికి రంగులు, సఫాయి కార్మికుల ఏర్పాటు విష యాన్ని కంపెనీ సీఎండీ సంజరు చౌబే దృష్టికి తీసుకెళ్లా లని కార్మిక సంఘం నాయకుడు భాస్కర్ రెడ్డితో వివరిం చారు. ప్రభుత్వ పాఠశాల స్వాగత ద్వారం ఆకర్షణీయంగా ఉండేలా నిర్మాణ పనులను చేపట్టాలని సంబంధిత కాం ట్రాక్టర్, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేష్ రెడ్డి, శ్రీశైలం, చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు, నాయకులు, ఎంపల్లి పద్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.