Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యూహాత్మకత రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా చేపట్టిన బహదూర్‌పురా ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యాని కన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్లో చేపట్టిన పలు నిర్మాణ పనులను ఆయన బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్. లోకేష్‌కుమార్, ఈఎన్సీ జియావుద్దీన్, చీఫ్ ఇంజి నీర్ (ప్రాజెక్టులు) దేవానంద్‌తో కలిసి పనులను పరిశీలి ంచారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రూ.69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవు గల ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులకు, ముఖ్యంగా జూ పార్క్ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మిస్తున్న అతి పొడవైన ఫ్లైఓవర్ పనులను కూడా లక్ష్యాని కన్నా ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సేకరించా ల్సిన మొత్తం 163 ఆస్తుల్లో మరికొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉన్నందున ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజినీర్లు వివరించగా, ఫ్లైఓవర్ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయా లని సీఎస్ సూచించారు. ఆరాంఘర్- జూపార్క్ ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఏ విధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ, అర్బన్ బయోడైవర్సిటీ, జలమండలి తదితర విభాగాలతో సమన్వ యంతో పని చేయాలని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ పర్యటనలో చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఎస్ఈ దత్తు పంత్, తదితరులు పాల్గొన్నారు.