Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టాలని హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల అధినేత పి.ఉమర్ ఖాన్ అన్నారు. కమలానగర్లోని ఎన్వీ భాస్కర్రావు భవన్లో బుధవారం ఆయన ఎన్పీఆర్డీ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయనీ, అలాంటి కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గడిచిన రెండేండ్లుగా కరోనా సమాజంలో వికలాంగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికీ కరోనా తీవ్రత కొనసాగుతుందనీ, అనేక మంది వికలాం గుల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా వికలాంగులైన విద్యార్థులు చదువుకోవడంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అంధులు, మూగ, చెవిటి విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వాలు వికలాంగులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. నూతన సంవత్సరంలో హక్కుల పరిరక్షణ కోసం నూతనోత్సాహం తో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 2022 సంవత్సరం వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగే సంవత్సరంగా ఉండాలన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య మాట్లాడుతూ చట్టాలు, సంక్షేమ పథకాలు ప్రతి వికలాం గునికీ అందేవరకు పోరాటం చేస్తామన్నారు. వికలాంగు లపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో హెలన్ కిల్లర్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆర్ముగం, హెలెన్ కెల్లర్ రిహాబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికళ, బాలయ్య, నాయకులు చంద్రకాంత్, రమేశ్, బ్రమ్మయ్య, తదితరుల పాల్గొన్నారు.