Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
సీఎం సహాయ నిధి పేదలకు కొండంత భరోసాను ఇస్తుంది అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం లేబర్ ఆఫీస్ సభ హాస్పిటల్ వద్ద గాంధీనగర్ డివిజన్‌కు చెందిన నలుగురు లబ్దిదారులు (సుజాత, రాకేష్, రవీందర్, సదానంద్) లకు రూ.1.14లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, సీనియర్ నాయకులు ముఠా నరేష్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం రాకేష్ కుమార్, పోతుల శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, మరిశెట్టి నర్సింగ్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్, జీవగిరి, ఇస్తారి, విటల్, పి. రాజ్‌కుమార్, బిక్షపతి, చందు తదితరులు పాల్గొన్నారు.