Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్ఓ) దక్షిణ భారత దేశం అధికార చైర్మెన్‌గా సీనియర్ జర్నలిస్ట్ రఫీ నియమితులయ్యారు. గురువారం సంఘం జాతీయ అధ్యక్షులు జితేందర్ కుమార్ నియామక పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ దక్షిణ రాష్ట్రాలలో మానవ హక్కుల పరిరక్షణకు కషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.