Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి అన్నారు. గురువారం బాగ్ అంబర్పేట డివిజన్ కుమ్మర్వాడి, వడ్డెరబస్తీలలో చేపడుతున్న డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ ముగురునీరు రోడ్లపై ప్రవహిస్తూ స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివ మూర్తి, నరసింహా, వెంకటేష్, అలీ, లక్ష్మణ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు