Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కలుషిత తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్లోని కమలానగర్ బస్తీలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కలుషిత నీరు, లోప్రెషర్ నీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి పైపులైన్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని, సమస్యను జల మండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. లోప్రెషర్ నీటి సమస్య పరిష్కరించి ఎక్కువ సమయం నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా పాదయాత్రలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో బస్తీ వాసులు వినోద్ కుమార్, సంతోష్, యాదగిరి, లక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.