Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం అడిక్‌మెట్ డివిజన్ ఫాతిమా మసీద్ వద్ద రూ.12 లక్షలతో వరద నీటి పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. నూతన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న డ్రయినేజీ పైప్ లైన్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరద ముంపు నివారణ కోసం ఫాతిమా మసీద్ గల్లీలో వరదనీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, శ్యాంసుందర్, జహంగీర్, మనోహర్ సింగ్, ఖదీర్, అబ్బూ, మల్లికార్జున్ రెడ్డి, మాధవ్, గురు దీప్ సింగ్, సుబ్బారావు, టైలర్ శీను, డివిజన్ ప్రెసిడెంట్లు ఆర్ మోజస్, రాకేష్ కుమార్, వల్లాల శ్యామ్ యాదవ్, నర్సింగ్ ప్రసాద్, దీన్ దయాల్ రెడ్డి, సాయి ప్రసన్న, మాధవి, ప్రేమ లత రెడ్డి, బిక్షపతి, రాజ మహేందర్ రెడ్డి, నాగులు, శ్రీకాంత్, యునిక్స్, మొహమ్మద్, జీహెచ్ఎంసీ అధికారులు డీఈ సన్నీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.