Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారులతో సమీక్షలో నిజాంపేట్ మేయర్ నీలాగోపాల్
నవతెలంగాణ-దుండిగల్
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని పెండింగ్ పనులపై అధికారులు, కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. పనులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ శంకర్‌లాల్, అధికారులు, టీఆర్ఎస్ ్ నాయకులు కోలన్ గోపాల్‌రెడ్డి, ఆవుల జగన్ యాదవ్, బొర్రా చందు, జనరల్ సెక్రెటరీ దూసకంటి వెంకటేష్, రాములు నాయక్ పాల్గొన్నారు.
.