Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
నాంపల్లి కేర్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. ఓ మహిళ మెదడు నుంచి కణితిని డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డాక్టర్ టి నరసింహారావు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా చాకేపల్లి గ్రామానికి చెందిన 35 ఏండ్ల భోజవ్వకు మెదడు కాండంలో కణితి ఉండటం వల్ల ముఖం ఎడమవైపున పరేస్తేసియాతో తీవ్ర ఇబ్బందితో బాధపడుతూ నాంపల్లి కేర్ ఆస్పత్రిని ఆశ్రయించింది. కణితి మెదడు కాండం ముఖ్యమైన నిర్మాణంలో ఉన్నందున అనుభవజ్ఞులైన ప్రత్యేక శిక్షణ పొందిన అనస్థీషియా బృందం సిబ్బంది మద్దతుతో 6-7 గంటలపాటు సర్జరీని పూర్తిచేసి కణితిని తొలగించామని చెప్పారు. ట్యూమర్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి అని, ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు అన్నారు. నాంపల్లిలో అత్యాధునిక న్యూరో సర్జరీ పరికరాలు, మౌలిక సదుపాయాలతో పేషంట్లకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు,