Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ప్రతి ఒక్కరూ కులరహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బాలానగర్ డివిజన్ తెలంగాణ దళిత సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మార్పు కోసం అందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అని, ఆయన ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదిమూల రాము, కార్యదర్శి ఎస్.కె. శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు నల్ల విల్సన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్మూరి శ్రీనివాస్ రావు, మధుమోహన్, జెరుపోతుల రవీందర్, ఎన్.వి.రత్నం, మల్లిగారి లక్ష్మీనారాయణ, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎడ్ల ప్రభాకర్, మహిళా నాయకులు ఎడ్ల కవిత, మీడియా సెక్రెటరీ నర్సింగ్ రావు, ఉపాధ్యక్షుడు దండు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.