Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేరిపోతుల పరుశురాములు
నవతెలంగాణ-ముషీరాబాద్
రాబోయే రిపబ్లిక్ డే వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొల్లి స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురాములు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదని, అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి భారతదేశ సమగ్రాభివృద్ధికి కోసం దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న దినంగా గణతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్నామని, కానీ ఆ వేడుకల్లో అంబేద్కర్ ఫొటో లేకపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకపోవడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నారు. కార్యక్రమంలో నాయకులు జోగు మురళి, కొమ్మ గళ్ల మచ్చ గిరి, గుర్క్ ప్రశాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.