Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న గంగాబాయి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆమెను కలిసి రూ.50 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు విజరురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నవాబ్, నాయకులు ఇంద్రసేనగుప్త, కస్తూరి బాలరాజు, రషీద్ బేగ్, పరుష శ్రీనివాస్ యాదవ్, అబిద్, అజరు ప్రసాద్‌గుప్త, సుంకరి చందు ముదిరాజ్, ఇబ్రహీంఖాన్, ఇమ్రాన్బేగ్, చెట్ల వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, తారాసింగ్, హమీద్, సంతోష్, రాజాబాయి, జహంగీర్‌ఖాన్, ఇస్మాయిల్, బిలాల్, వెంకట్, ఖాదర్, మోహిన్, యూసుఫ్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.