Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరీష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ టెస్టులు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. కరోనా నియంత్ర చర్యలపై గురువారం వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు ఇతర సిబ్బందితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే నిర్వహిస్తామన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.