Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ొ25న చిత్తూరు మదనపల్లిలో దక్షిణాది రాష్ట్రాల బీసీ సభ
నవతెలంగాణ-అడిక్మెట్
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల బీసీ నాయకుల భారీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం విద్యా నగర్ బీసీ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని, బీసీలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జనాభా గణనలో కులగణన చేయడానికి ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు లేవని గుర్తు చేశారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ప్రతిపాదనలు లేవని ఆవేదన చెందారు. మోడీ బొమ్మ చూపి ఓట్లు వేయించుకోవడం తప్ప బీసీల అభివృద్ధికి బీజేపీ ఏమీ చేయలేదని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే వరకు ఉద్యమం జాతీయ స్థాయిలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, సి రాజేందర్, సుధాకర్, బీసీ యువజన సంఘం చైర్మెన్ చంటి ముదిరాజ్, జిల్లపల్లి అంజి, జోషి, జయంతి తదితరులు పాల్గొన్నారు.