Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి డివిజన్ విజ్ఞాన్పురి కాలనిలో అక్రమ షెడ్లు వెలుస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కరెంట్ స్తంభాన్ని కూడా వదల్లేదు. స్తంభం షెడ్డు మధ్యలోకి వచ్చేలా నిర్మాణం చేపట్టి దర్జాగా తన వ్యాపార కార్యకలపాలు నిర్వహిస్తున్నాడు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులుగాని, విద్యుత్ అధికారులు గాని ఇంత వరకు ఎటువంటి చర్యలు పట్టించుకోకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అక్రమ షెడ్డు నిర్మాణాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.