Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రయివేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని గెజిటెడ్ ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.అరుణ్‌కుమార్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి.కృష్ణ అన్నారు. గురువారం తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం 2022 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగ కల్పన కోసం జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండుగుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.